బీజేపీ సంబరాలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:45 AM
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిన నేతలు
ప్రధాని మోదీ పాలనకు మూడు రాష్ట్రాల్లో విజయం నిదర్శనం
ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
సీతమ్మధార, మే 4 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీతమ్మధారలోని ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలపై ప్రజలు నమ్మకం ఉంచడం, కార్యకర్తలు అహర్నిశలూ శ్రమించడం వల్లనే మూడు రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సురేష్‌బాబు, శ్యామల దీపిక, పృథ్వీరాజ్, వార్డు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.