Share News

గజగజలాడిస్తున్న చలి

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:22 AM

మన్యంలో చలి గజగజలాడిస్తోంది. వాతావరణంలోని మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి వణికిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు సైతం దట్టంగానే కురుస్తోంది. శనివారం జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే తాజా వాతావరణం మాత్రం మన్యం సందర్శనకు విచ్చేసే పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది.

గజగజలాడిస్తున్న చలి
పాడేరు మెయిన్‌రోడ్డులో శనివారం ఉదయం పొగమంచు వాతావరణం

దట్టంగా కురిసిన మంచు

జి.మాడుగులలో 8.2 డిగ్రీలు

పాడేరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

మన్యంలో చలి గజగజలాడిస్తోంది. వాతావరణంలోని మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి వణికిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు సైతం దట్టంగానే కురుస్తోంది. శనివారం జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే తాజా వాతావరణం మాత్రం మన్యం సందర్శనకు విచ్చేసే పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది.

జి.మాడుగులలో 8.2 డిగ్రీలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతూ శీతల గాలలు వీస్తుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. శనివారం జి.మాడుగులలో 8.2 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 9.9, చింతపల్లి, హుకుంపేటలో 10.7, ముంచంగిపుట్టులో 11.2, పెదబయలులో 11.4, కొయ్యూరులో 13.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Feb 01 , 2026 | 01:22 AM