Share News

బీసీలకు పెద్ద పీట

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:42 AM

స్థానిక మునిసిపాలిటీలో వార్డుల రిజర్వేషన్‌ వివరాలను మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర మంగళవారం విడుదల చేశారు. మొత్తం 40 వార్డులకుగాను 50 శాతం.. అంటే 20 వార్డులను మహిళలకు కేటాయించారు. ఇక వివిధ కేటగిరీల రిజర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ రెండు, ఎస్సీ మహిళలకు రెండు, బీసీ జనరల్‌ ఎనిమిది, బీసీ మహిళలకు ఏడు, జనరల్‌ మహిళలకు 11 వార్డులను రిజర్వు చేశారు. మిగిలిన తొమ్మిది వార్డులను అన్‌ రిజర్వుడ్‌ కింద వుంచారు. మొత్తం వార్డుల్లో బీసీలకు 37.5 శాతం కేటాయించడం విశేషం.

 బీసీలకు పెద్ద పీట

నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో 37.5 శాతం వార్డులు కేటాయింపు

మొత్తం మీద సగం స్థానాలు మహిళలకు రిజర్వు

నర్సీపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో వార్డుల రిజర్వేషన్‌ వివరాలను మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర మంగళవారం విడుదల చేశారు. మొత్తం 40 వార్డులకుగాను 50 శాతం.. అంటే 20 వార్డులను మహిళలకు కేటాయించారు. ఇక వివిధ కేటగిరీల రిజర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ రెండు, ఎస్సీ మహిళలకు రెండు, బీసీ జనరల్‌ ఎనిమిది, బీసీ మహిళలకు ఏడు, జనరల్‌ మహిళలకు 11 వార్డులను రిజర్వు చేశారు. మిగిలిన తొమ్మిది వార్డులను అన్‌ రిజర్వుడ్‌ కింద వుంచారు. మొత్తం వార్డుల్లో బీసీలకు 37.5 శాతం కేటాయించడం విశేషం.

ఎవరికి.. ఏ వార్డులు...

ఎస్టీ : 28వ వార్డు

ఎస్సీ : 6, 17 వార్డులు

ఎస్సీ (మహిళలు): 4, 5 వార్డులు

బీసీ : 1, 8, 18, 20, 21, 25, 26, 27 వార్డులు

బీసీ (మహిళలు): 2, 3, 7, 10, 19, 34, 38 వార్డులు

జనరల్‌ (మహిళలు): 9, 12, 13, 16, 23, 24, 33, 36, 37, 39, 40 వార్డులు

అన్‌ రిజర్వుడ్‌: 11, 14, 15, 22, 29, 30, 31, 32, 35 వార్డులు

ఎలమంచిలిలో...

ఎలమంచిలి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో వార్డుల రిజర్వేషన్‌ వివరాలను మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు మంగళవారం విడుదల చేశారు. మొత్తం 32 వార్డులకుగాను 50 శాతం.. అంటే 16 వార్డులను మహిళలకు కేటాయించారు. ఇక వివిధ కేటగిరీల రిజర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. ఎస్టీ జనరల్‌ ఒకటి, ఎస్సీ జనరల్‌ రెండు, ఎస్సీ మహిళ ఒకటి, బీసీ జనరల్‌ ఆరు, బీసీ మహిళలకు ఆరు, జనరల్‌ మహిళలకు 9 వార్డులను రిజర్వు చేశారు. మిగిలిన ఏడు వార్డులను అన్‌ రిజర్వుడ్‌ కింద వుంచారు. మొత్తం వార్డుల్లో బీసీలకు 37.5 శాతం కేటాయిం చారు.

ఎవరికి.. ఏ వార్డులు...

ఎస్టీ జనరల్‌: 23వ వార్డు

ఎస్సీ మహిళ: 11వ వార్డు,

ఎస్సీ జనరల్‌: 18, 21 వార్డులు

బీసీ మహిళ: 4, 9, 12, 13, 15, 27 వార్డులు

బీసీ జనరల్‌: 2, 5, 6, 24, 26, 30 వార్డులు

మహిళలు జనరల్‌: 8, 10, 14, 17, 19, 20, 25, 28, 31 వార్డులు

అన్‌ రిజర్వుడు: 1, 3, 7, 16, 22, 29, 32 వార్డులు

Updated Date - Oct 14 , 2026 | 12:44 AM