Share News

భోగాపురం ఎయిర్‌పోర్టు

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:35 AM

భోగాపురంలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభం కానున్నది. విమానాశ్రయం ఈ నెల మొదటి వారానికే సిద్ధమైనా, ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించాలనే ఆలోచనతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారను. ఒకటిన భోగాపురం వచ్చేందుకు ప్రధాని అంగీకరించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార వర్గాలను ఆదేశించింది.

భోగాపురం  ఎయిర్‌పోర్టు

ప్రారంభానికి సిద్ధం 1న ముహూర్తం

విశాఖ నుంచి విమాన ప్రయాణికుల కోసం

ఎలక్ర్టిక్‌ బస్సులు నడపనున్న ఆర్టీసీ

నాలుగుచోట్ల లాంజ్‌ల ఏర్పాటు

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

భోగాపురంలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభం కానున్నది. విమానాశ్రయం ఈ నెల మొదటి వారానికే సిద్ధమైనా, ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించాలనే ఆలోచనతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారను. ఒకటిన భోగాపురం వచ్చేందుకు ప్రధాని అంగీకరించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార వర్గాలను ఆదేశించింది.

విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడానికి ఏడు మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణాన్ని వీఎంఆర్‌డీఏ ఇప్పటికే చేపట్టింది. వాటిలో నాలుగు రహదారులు పూర్తి కాగా, మరో రహదారి పనులు 75 శాతం పూర్తయ్యాయి. ఇంకో రెండు రహదారుల నిర్మాణం జరుగుతోంది.

మరోవైపు ఇక్కడి నుంచి విమాన ప్రయాణికులు భోగాపురం వెళ్లడానికి ఆర్టీసీ ఎలక్ర్టిక్‌ బస్సులను సిద్ధం చేసింది. మొత్తం 20 బస్సులు కాగా తొలి విడతలో మూడు వచ్చాయి. వాటితో ట్రయల్‌ రన్‌ వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జీఎంఆర్‌ యాజమాన్యం విమాన ప్రయాణికుల కోసం నాలుగు చోట్ల పాసింజర్‌ లాంజ్‌ల ఏర్పాటుకు ముందుకువచ్చింది. గురుద్వారా, వుడా పార్క్‌, ఆటోనగర్‌, వెంకోజీపాలెంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమైన స్థలం, ఇతర సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను జీఎంఆర్‌ ప్రతినిధులు కోరారు. ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని యత్నిస్తున్నారు. జీవీఎంసీ తరపున భోగాపురానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉంది. విజయనగరం జిల్లా అధికారులు వారి పరిధిలో కొన్నిచోట్ల సూచికలు ఏర్పాటుచేసినా వాటిపై సరైన వివరాలు లేవు. విశాఖ మార్గాల్లోనైనా సరైన సూచికలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

Updated Date - Jul 19 , 2026 | 01:35 AM