భానుడి భగ భగలు
ABN , Publish Date - May 17 , 2026 | 11:17 PM
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత, వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
దేవరాపల్లిలో 41.2 డిగ్రీలు
అనకాపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత, వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దేవరాపల్లిలో 41.2, నర్సీపట్నం, మాకవరపాలెంలో 40.2, నాతవరంలో 39.5, చోడవరంలో 39.2, గొలుగొండ, రావికమతం, మాడుగులలో 38.9, బుచ్చెయ్యపేటలో 38.8, కె.కోటపాడు, సబ్బవరంలో 38.5, మునగపాకలో 38.4, చీడికాడలో 38.1, రోలుగుంటలో 37.9, కశింకోటలో 37.7, అనకాపల్లిలో 37.5, నక్కపల్లిలో 37, అచ్యుతాపురంలో 36.9, కోటవురట్లలో 36.8, ఎస్.రాయవరంలో 36.7, పాయకరావుపేటలో 36.5, రాంబిల్లిలో 36.3, ఎలమంచిలిలో 36.1, పరవాడలో 35.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.