Share News

డీఈవోగా భానుమూర్తిరాజు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:37 AM

జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్‌.భానుమూర్తిరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ ఇక్కడ డీఈవోగా పని చేసిన రామకృష్ణారావు జూన్‌ నెలలో రిలీవ్‌ కావడంతో గిరిజన సంక్షేమ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళకు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

డీఈవోగా భానుమూర్తిరాజు బాధ్యతల స్వీకరణ
డీఈవో భానుమూర్తిరాజుకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలుకుతున్న సిబ్బంది

గిరిజన ప్రాంత విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

పాడేరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్‌.భానుమూర్తిరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ ఇక్కడ డీఈవోగా పని చేసిన రామకృష్ణారావు జూన్‌ నెలలో రిలీవ్‌ కావడంతో గిరిజన సంక్షేమ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళకు అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌, ట్రైనింగ్‌(ఎస్‌సీఈఆర్‌టీ)లో సీనియర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎన్‌.భానుమూర్తిరాజుకు స్థానిక డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఆయన ఇక్కడకు వచ్చి తొలుత స్థానిక మోదకొండమ్మను దర్శించుకుని తరువాత డీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

Updated Date - Aug 06 , 2026 | 12:38 AM