Share News

ఉదయం పదైనా భానుడు కనిపించడే!

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:44 PM

మన్యంలో కొద్ది రోజులుగా శీతాకాలాన్ని తలపించేలా దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. దీంతో రోడ్డు మార్గం సరిగా కనిపించక వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి.

ఉదయం పదైనా భానుడు కనిపించడే!
పాడేరు మెయిన్‌రోడ్డులో గురువారం ఉదయం పొగమంచు

మన్యంలో దట్టంగా పొగమంచు

పాడేరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కొద్ది రోజులుగా శీతాకాలాన్ని తలపించేలా దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. దీంతో రోడ్డు మార్గం సరిగా కనిపించక వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. ఏజెన్సీలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఆ తర్వాత ఎండ తీవ్రంగా కాసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గి ఆకాశం మేఘావృతమైంది. గురువారం ముంచంగిపుట్టులో 17.5, డుంబ్రిగుడలో 17.9, అరకులోయలో 18.0, పెదబయలులో 19.0, చింతపల్లిలో 19.2, కొయ్యూరులో 21.3, అనంతగిరిలో 21.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో గురువారం పొగమంచు దట్టంగా కురిసింది. వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఎదుటి వ్యక్తులు కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు.

Updated Date - Mar 26 , 2026 | 11:45 PM