వేసవిని మించి...
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:16 AM
విశాఖలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వచ్చి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
ఎండలు, ఉక్కబోతతో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
14న అత్యధికంగా 20.668 మిలియన్ యూనిట్ల వినియోగం
గత ఏడాది అదే రోజు వినియోగం 18.158 మిలియన్ యూనిట్లే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వచ్చి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడినా ఎటువంటి ప్రభావం చూపడం లేదు. ఎండలే కొనసాగుతున్నాయి. వేసవి స్థాయిలో 35 సెల్సియస్ డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20 మిలియన్ యూనిట్లకు పైగానే వాడేస్తున్నారు. దీంతో డిమాండ్ వేయి మెగావాట్లను దాటేస్తోంది.
సాధారణంగా జూలై నెలలో వర్షాలు కురవడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గిపోతుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. మబ్బులు వేసినా తట్టుకోలేనంతగా ఉక్కపోత ఉంటోంది. దీంతో ప్రజలు నిరంతరం ఫ్యాన్లు, ఏసీలు వాడుతున్నారు. ఈ మేరకు విద్యుత్ డిమాండ్, వినియోగం పెరుగుతోంది. గత ఏడాది (2025) జూలై నెల 15న అత్యధిక విద్యుత్ వినియోగం 18.629 మిలియన్ యూనిట్లు కాగా డిమాండ్ 911 మెగావాట్లు. ఈ ఏడాది జూలై పదిహేను రోజుల్లో అత్యధిక వినియోగం (14వ తేదీ) 20.688 మిలియన్ యూనిట్లు కాగా డిమాండ్ 1,028 మెగావాట్లుగా నమోదైంది. అంటే గత ఏడాది కంటే రెండు మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది. ఇది చాలా అత్యధికమని, వేసవి లాగే వినియోగదారులు విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారని విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఈ శ్యాంబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
రెండేళ్లలో విద్యుత్ వినియోగం
---------------------------------------------------------------
2025 2026 జూలై 1
జూలై 1 13.843 మి.యూ 19.056 మి.యూ
జూలై 2 13.243 మి.యూ 19.194 మి.యూ
జూలై 3 14.266 మి.యూ 18.423 మి.యూ
జూలై 4 13.929 మి.యూ 16.427 మి.యూ
జూలై 5 13.578 మి.యూ 18.598 మి.యూ
జూలై 6 14.833 మి.యూ 17.611 మి.యూ
జూలై 7 15.001 మి.యూ 18.228 మి.యూ
జూలై 8 14.799 మి.యూ 18.474 మి.యూ
జూలై 9 15.300 మి.యూ 19.684 మి.యూ
జూలై 10 15.916 మి.యూ 19.702 మి.యూ
జూలై 11 17.388 మి.యూ 19.714 మి.యూ
జూలై 12 17.986 మి.యూ 19.065 మి.యూ
జూలై 13 16.607 మి.యూ 19.905 మి.యూ
జూలై 14 18.158 మి.యూ 20.668 మి.యూ
జూలై 15 18.629 మి.యూ 19.133 మి.యూ
-----------------------------------------------------------------------------------------