Share News

బాబోయ్‌ శునకాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:25 AM

జిల్లాలో వీధి కుక్కల బెడద నానాటికీ తీవ్రతరం అవుతున్నది. గ్రామసింహాలు వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ, కనిపించిన వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. రావికమతం మండలం కొత్తకోట, మర్రివలస గ్రామాల్లో శుక్రవారం కుక్కల గుంపు దాడిలో పది మందికి గాయాలయ్యాయి. అచ్యుతాపురం మండలం దుప్పితూరులో ఇటీవల కుక్కకాటుకు గురైన బాలుడు రేబిస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.

బాబోయ్‌ శునకాలు
కుక్కకాటు బాధితులు అమ్మిరెడ్డి కౌశిక్‌, వై.లక్ష్మి, బి.జనశ్రీ

స్వైరవిహారం చేస్తున్న గ్రామసింహాలు

కొత్తకోట, మర్రివలసల్లో వీధి కుక్కల దాడి.. పది మందికి గాయాలు

దుప్పితూరులో రేబిస్‌ బారినపడి బాలుడి మృతి

జిల్లాలో వీధి కుక్కల బెడద నానాటికీ తీవ్రతరం అవుతున్నది. గ్రామసింహాలు వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ, కనిపించిన వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. రావికమతం మండలం కొత్తకోట, మర్రివలస గ్రామాల్లో శుక్రవారం కుక్కల గుంపు దాడిలో పది మందికి గాయాలయ్యాయి. అచ్యుతాపురం మండలం దుప్పితూరులో ఇటీవల కుక్కకాటుకు గురైన బాలుడు రేబిస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.

---

రావికమతం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తకోట, మర్రివలస గ్రామాల్లో శుక్రవారం వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో కొత్తకోట మోదకొండమ్మ గుడి నుంచి వెల్లంకి వారి వీధి వరకు పలువురిపై దాడిచేసి కరిచాయి. తరువాత సమీప మర్రివలస గ్రామానికి వెళ్లి రామాలయం సమీపంలో పాదచారులపై దాడి చేశారు. మొత్తం పదిమంది గాయపడగా వీరిలో ఐదుగురు విద్యార్థులు వున్నారు. కుక్కకాటు బాధితుల్లో అమ్మిరెడ్డి కౌశిక్‌, బి.జనశ్రీ, వై.లక్ష్మి, పి.సునంద కుమార్‌ ఎ.రమణమ్మ, వై.రాజేశ్‌ ,జి.గోవింద్‌, జి.వీరన్న, ఎం.రామచందర్‌ వున్నారు. వీరికి కొత్తకోట పీహెచ్‌సీలో వైద్యం అందించారు. అనంతరం వీరన్న మినహా మిగిలిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రేబిస్‌తో బాలుడి మృతి

అచ్యుతాపురం, జనవరి 2 (ఆంరఽధజ్యోతి): మండలంలోని దుప్పితూరులో రేబిస్‌ బారినపడి బాలుడు మృతిచెందాడు. ఒడిశాకు చెందిన గుడియా రామకృష్ణ, రుక్మిణి దంపతులు బతుకుతెరువుకోసం సుమారు రెండు దశాబ్దాల క్రితం దుప్పితూరు వచ్చారు. వీరి కుమారుడు నంద (14) దుప్పితూరు ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పది రోజుల క్రితం ఇతడిని వీధి కుక్క కరిచింది. తల్లిదండ్రులు నాటువైద్యం చేయించి వదిలేశారు. నందను కరిచింది పిచ్చికుక్క కావడం, సరైన వైద్యం చేయించకపోవడంతో హైడ్రోఫోబియా (రేబిస్‌)కు గురయ్యాడు. కానీ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. మానసికంగా బాధపడుతున్నాడని భావించారు. అయితే పరిస్థితి మరింత తీవ్రం కావడంతో రెండు రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

Updated Date - Jan 03 , 2026 | 12:25 AM