సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:56 AM
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు
మాడుగుల రూరల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వమ్మలి గ్రామానికి చెందిన మేడివాడ వెంకటరావు, రాజేశ్వరి దంపతుల పిల్లలు జ్ఞాన వైష్ణవి, రాహుల్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)లో మెరుగైన ర్యాంకులు సాధించారు. అనకాపల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జ్ఞాన వైష్ణవి ఎనిమిదో తరగతి, రాహుల్ ఐదో తరగతి చదువుతున్నారు. జనవరిలో ఏఐఎస్‌ఎస్‌ఈఈ నిర్వహించగా, గత నెత 27వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. జ్ఞాన వైష్ణవి 400 మార్కులకు 354 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 139 ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. రాహుల్ 300 మార్కులకు గాను 280 మార్కులు సాధించి జాతీయస్థాయిలో 400 ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించారు.