Share News

కడుతుల సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్‌

ABN , Publish Date - May 30 , 2026 | 11:41 PM

మండలంలోని పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది.

కడుతుల సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్‌
సమీప కొండల వైపు వెళ్లిపోతున్న ఎలుగుబంటి

ముంచంగిపుట్టు, మే 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఉదయం గ్రామ సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కార్మికుల వైపు ఎలుగుబండి వచ్చింది. దానిని చూసిన ఉపాధి కూలీలు తొలుత భయభ్రాంతులకు గురయ్యారు. కొంత సమయానికి వారు తేరుకొని పెద్దగా కేకలు వేయడంతో ఎలుగుబంటి సమీప కొండ వైపు వెళ్లిపోయింది. జనసంచారంలోకి వచ్చిన ఎలుగుబంటికి స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వైరల్‌ చేశారు.

Updated Date - May 30 , 2026 | 11:41 PM