వారపుసంతలా బీచ్ రోడ్డు
ABN , Publish Date - May 25 , 2026 | 12:15 AM
నగరంలోని రామకృష్ణా బీచ్ శని, ఆదివారాల్లో వారపుసంతను తలపిస్తోంది.
దుస్తులు, మొక్కలు విక్రయం
ఫుట్‌పాత్‌లపై కార్ల లో అమ్మకాలు
చలానాలకే పరిమితమవుతున్న పోలీసులు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
నగరంలోని రామకృష్ణా బీచ్ శని, ఆదివారాల్లో వారపుసంతను తలపిస్తోంది. ఫుట్‌పాత్‌లు,పార్కులను ఆక్రమించి అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ సాగిపోతున్నాయి. సందర్శకులు ఫుట్‌పాత్‌లపై నడిచే అవకాశమే కనిపించడం లేదు. గతంలో బీచ్, దానికి ఆనుకొన్న ఫుట్‌పాత్‌పై మొక్కజొన్న పొత్తులు, మురీమిక్చర్, వేరుశనగలు, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్‌లు తదితర ఆహార పదార్థాలు విక్రయించేవారు. వేసవి సెలవులు, ఎండల ధాటికి శని, ఆదివారాల్లో కుటుంబాలతో సహా సేదతీరడానికి బీచ్‌కు తరలివస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఆర్‌కే బీచ్ కిక్కిరిసిపోతోంది. వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక చోదకులు అవస్థలు పడుతున్నారు. దీంతో రోడ్డు పక్కనే స్కూటర్లు, బైకులు పెట్టి వెళ్లిపోతున్నారు. కార్లను కూడా అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు యంత్రాలు పట్టుకొని చలాన్లు రాయడం, పెండింగ్ చలాన్లు వసూలు చేయడంలో బిజీగా ఉంటున్నారు. ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదు.
ఇటీవల కొత్త వ్యాపారాలు
ఇటీవల బీచ్ రోడ్డులో కొత్త వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఉచిత ప్రచారాలకు, రూపాయి ఖర్చు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చునని చాలామంది చిన్న చిన్న బండ్లు, టెంట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. ఒక జ్యువెలరీ షాపు బంగారు నాణేలు విక్రయించింది. తాజాగా రడీమేడ్ దుస్తులు, పూలమొక్కలు, జాగింగ్ దుస్తులు, ఇంట్లో అలంకరణ సామగ్రి, ఇలా సంతల్లో దుకాణాలు పెట్టినట్టు ఫుట్‌పాత్‌లపై కార్లు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. అయినా పోలీసులకు ఇవేమీ కనిపించడం లేదు. ఆయా దుకాణాల వద్దకు జనం భారీగా చేరుకుని, ట్రాఫిక్ స్తంభించినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి అనధికార వ్యాపారాలను కట్టడి చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపైన, ట్రాఫిక్‌ను చక్కదిద్దాల్సిన బాధ్యత పోలీసులపైనా ఉంది.
తూతూమంత్రంగా తరలింపు
అనధికార వ్యాపారాలకు సంబంధించిన ఫొటోలు తీసేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నిస్తుండగా ఇదేదో ఇబ్బందికరంగా మారుతుందని భావించిన జీవీఎంసీ అధికారులు హడావుడిగా ఒకటి రెండు దుకాణాలను తరలించారు. మిగిలిన వాటిని అలానే వదిలేశారు.
బీఈడీ ప్రవేశాలపై గురి!
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కాలేజీల వల
అధిక ఫీజులు వసూలు చేసుకునేందుకు ఎత్తుగడ
కౌన్సెలింగ్ ప్రారంభం కాకముందే యాజమాన్య కోటా సీట్ల భర్తీపై దృష్టి
పట్టించుకోని ఏయూ ఉన్నతాధికారులు
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల యాజమాన్యా లు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. కొన్నేళ్లుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని బీఈడీ కాలేజీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు చేరుతున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఫీజు చెలిస్తే చాలు. తరగతులకు హాజరుకపోయినా ఆ బాధ్యతను యాజమాన్యాలు చూసుకుం టాయి. సాధారణంగా కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తారు. అయితే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకుంటే భారీగా ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రానికి, చెందిన విద్యార్థులకు ఈ కోటా సీట్లు కేటాయిస్తే ఒక్కో సీటుకు రూ.40 వేల నుంచి రూ.60 వేలకు మించి రాదు. అదే ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల విద్యార్థుల నుంచి ఒక్కో ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజులు, ఇతర ఫీజుల పేరుతో మరో రూ.50 వేల వరకు లాగేస్తుంటారు. అంటే ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2 లక్షల వరకు గిట్టుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకట్టుకునే పనిలో అనేక కాలేజీ యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. బీఈడీ కోర్సుల్లో చేరాలన్న ఆసక్తిగల వారిని గుర్తించి, ముందుగానే సీట్లు రిజర్వు చేసుకోవాలని వల వేస్తున్నాయి. ఈ మేరకు కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నట్టు సమాచారం.
ర్యాటిఫికేషన్ చేపట్టరా.?
ఏయూ పరిధిలోని బీఈడీ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, భవ నాలు, ఇతర సదుపాయాలను పరిశీలించి వాటిని అధికారులు ర్యాటిఫై చేయాలి. అయితే వర్సిటీ అధికారులు డిగ్రీ, పీజీ కాలేజీల ర్యాటిఫికేషన్ ప్రక్రియను చేపట్టారని, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కాలేజీల ర్యాటిఫికేషన్ ప్రక్రియను పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుతో చెక్..
రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ, డిగ్రీ, పీజీ, లా, ఇతర కోర్సులు నిర్వహించే కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అయిన ప్పటికీ అనేక కాలేజీలు దీనిని పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థుల కు ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తే అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.