బీచ్ ఫెస్టివల్ అదుర్స్
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:16 AM
అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం ముత్యాలమ్మపాలెం సాగర తీరంలో ‘బీచ్ ఫెస్టివల్’ ఘనంగా మొదలైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, తదితరులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రులు మాట్లాడుతూ, ముత్యాలమ్మపాలెం తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
తరలివచ్చిన స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు
ముత్యాలమ్మపాలెం తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడి
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అధికసంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు
పరవాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం ముత్యాలమ్మపాలెం సాగర తీరంలో ‘బీచ్ ఫెస్టివల్’ ఘనంగా మొదలైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, తదితరులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రులు మాట్లాడుతూ, ముత్యాలమ్మపాలెం తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బీచ్‌లో కళావేదికపై ప్రదర్శించిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. సినీ గాయని గీతామాధురి పాడిన పలు గీతాలకు కుర్రకారు నృత్యం చేస్తూ సందడి చేశారు. తోలుబొమ్మలు, కాళీమాత నేలవేషాలు ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కళాకారులు ఆటో రాంప్రసాద్, రైజింగ్ రాజు, దొరబాబు, శాంతిస్వరూప్‌ల కామెడీ స్కిట్లు నవ్వులు పూయించాయి. స్థానిక కళాకారుల ఆటపాటలు అలరించాయి. తానాం గురుకుల పాఠశాల విద్యార్థినిల యోగాసనాలు అబ్బురపరిచాయి. ఫుడ్ స్టాల్స్ జనంతో కిక్కిరిశాయి. బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, స్థానిక సర్పంచ్ చింతకాయల సుజాత, టీడీపీ నేత ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.