Share News

పరిషత్‌ పదవుల్లో బీసీలకు పెద్దపీట

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:49 AM

జడ్పీటీసీ స్థానాలకు రిజరేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బుధవారం గెజిట్‌ విడుదల చేశారు. జిల్లాలో వున్న జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్‌ వివరాలకు సంబంధించి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 24 స్థానాలకుగాను తొమ్మిదింటిని (37.5 శాతం) బీసీలకు రిజర్వు చేశారు. వీటిలో ఐదు స్థానాలను బీసీ మహిళలకు కేటాయించగా, నాలుగు స్థానాలను బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు 1, అన్‌రిజర్వుడ్‌ మహిళలకు ఆరు కేటాయించగా, అన్‌ రిజర్వుడ్‌లో ఆరు స్థానాలు వున్నాయి.

పరిషత్‌ పదవుల్లో బీసీలకు పెద్దపీట
అనకాపల్లి జిల్లా పరిషత్‌ కార్యాలయం

మొత్తం స్థానాల్లో 37.5 శాతం రిజర్వు

జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో తొమ్మిది చొప్పున కేటాయింపు

ఎస్టీలకు ఒక్కొక్కటి, ఎస్సీలకు రెండేసి...

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కలెక్టర్‌

అనకాపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ స్థానాలకు రిజరేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బుధవారం గెజిట్‌ విడుదల చేశారు. జిల్లాలో వున్న జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్‌ వివరాలకు సంబంధించి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 24 స్థానాలకుగాను తొమ్మిదింటిని (37.5 శాతం) బీసీలకు రిజర్వు చేశారు. వీటిలో ఐదు స్థానాలను బీసీ మహిళలకు కేటాయించగా, నాలుగు స్థానాలను బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు 1, అన్‌రిజర్వుడ్‌ మహిళలకు ఆరు కేటాయించగా, అన్‌ రిజర్వుడ్‌లో ఆరు స్థానాలు వున్నాయి.

బీసీ మహిళలకు బుచ్చెయ్యపేట, కశింకోట, దేవరాపల్లి, ముగనపాక, రావికమతం జడ్పీటీసీలను కేటాయించగా, బీసీలకు ఎలమంచిలి, చీడికాడ, వి.మాడుగుల, నర్సీపట్నం జడ్పీటీసీలను రిజర్వు చేశారు. ఎస్టీలకు గొలుగొండ, ఎస్సీ మహిళకు కోటవురట్ల, నక్కపల్లి జడ్పీటీసీలను ఎస్సీలకు కేటాయించారు.

ఎంపీపీ రిజర్వేషన్లు...

జిల్లాలో 24 మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారికంగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా గెజిట్‌లో విడుదల చేశారు. మొత్తం పదవుల్లో తొమ్మిదింటిని (37.5 శాతం) బీసీలకు రిజర్వు చేశారు. వీటిలో నాలుగు స్థానాలను బీసీ మహిళలకు, ఐదు స్థానాలను బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ మహిళలకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళలకు ఒకటి, అన్‌రిజర్వుడ్‌ మహిళలకు ఆరు కేటాయించగా, అన్‌ రిజర్వుడ్‌లో ఆరు స్థానాలు వున్నాయి.

బీసీ మహిళలకు అనకాపల్లి, కె.కోటపాడు, మాకవరపాలెం, రోలుగుంట మండలాలు కేటాయించగా, బీసీలకు అచ్యుతాపురం, చోడవరం, పరవాడ, సబ్బవరం, గొలుగొండ మండలాలు రిజర్వు అయ్యాయి. ఎస్టీ మహిళకు వి.మాడుగుల, ఎస్సీ మహిళకు నాతవరం, ఎస్సీలకు పాయకరావుపేట మండలాలు కేటాయించారు.

Updated Date - Oct 15 , 2026 | 12:49 AM