Share News

బీసీ మహిళకు జడ్పీ పీఠం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:45 AM

జిల్లా పరిషత్‌ (జడ్పీ) మొట్టమొదటి చైర్‌పర్సన పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ మైలవరపు తేజ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లాలో ఉన్న రెండు మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ పదవులను ఇప్పటికే మహిళలకు కేటాయించగా, తాజాగా జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కూడా వారికే రిజర్వు చేశారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మూడు ప్రధానమైన పదవులను మహిళలు అధిష్ఠించనున్నారు. దీంతో మహిళలు.. ముఖ్యంగా బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

 బీసీ మహిళకు జడ్పీ పీఠం

అధికార కూటమి నుంచి పలువురు ఆశావహులు

రేసులో లాలం భవానీ, పి.సత్యవతి, కిలపర్తి రాజేశ్వరి

ఇప్పటికే అధిష్ఠానానికి దరఖాస్తులు

వైసీపీ నుంచి బీవీ సత్యవతి, అనురాధ, డాక్టర సౌమ్య యత్నాలు

అనకాపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ (జడ్పీ) మొట్టమొదటి చైర్‌పర్సన పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ మైలవరపు తేజ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లాలో ఉన్న రెండు మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ పదవులను ఇప్పటికే మహిళలకు కేటాయించగా, తాజాగా జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కూడా వారికే రిజర్వు చేశారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మూడు ప్రధానమైన పదవులను మహిళలు అధిష్ఠించనున్నారు. దీంతో మహిళలు.. ముఖ్యంగా బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో తొలి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో జడ్పీ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని అధికార కూటమి పట్టుదలతో వుంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో ఘన విజయం సాధించారు. రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రభుత్వంపై మరింత సానుకూలత పెరిగిందని, అందువల్ల జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని భారీ మెజారిటీతో సొంతం చేసుకుంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కూటమి నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుందన్నది ఇంకా ఖరారు కానప్పటికీ.. టీడీపీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు మహిళలు జడ్పీ చైర్‌పర్సన్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాలం భవానీ, కొప్పల వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పీవీజీ కుమార్‌ సతీమణి, చీడికాడ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పి.సత్యవతి, దేవరాపల్లి మండలానికి చెందిన కిలపర్తి రాజేశ్వరి రేసులో వున్నారు. తమకు చైర్‌పర్సన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఇక ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా జడ్పీ చైర్‌పర్సన్‌ టికెట్‌ను పలువురు ఆశిస్తున్నారు. వీరిలో అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి, సబ్బవరం జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొటాన రాము కోడలు డాక్టర్‌ సౌమ్య, మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ, తదితరులు వున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:45 AM