Share News

ఈదురుగాలులతో అరటి తోటలకు నష్టం

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:09 AM

మండలంలోని రెండు రోజుల నుంచి సాయంత్రంపూట వీస్తున్న ఈదురుగాలులకు అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాతమల్లంపేట, ఏటిగైరంపేట, ఎర్రపాలెం, సీతఖండి తదితర గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి.

ఈదురుగాలులతో అరటి తోటలకు నష్టం
పాతమల్లంపేటలో నేలకొరిగిన అరటి పంట

సుమారు 50 ఎకరాల్లో నేలవాలిన పంట

గొలుగొండ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి) : మండలంలోని రెండు రోజుల నుంచి సాయంత్రంపూట వీస్తున్న ఈదురుగాలులకు అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాతమల్లంపేట, ఏటిగైరంపేట, ఎర్రపాలెం, సీతఖండి తదితర గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. మరికొద్ది రోజుల్లో గెలలు పక్వానికి వస్తాయని, ఈ తరుణంలో అకాల వర్షానికితోడు బలంగా వీచిన ఈదురుగాలులకు అరటి తోటలు నేలవాలడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఎకరాలకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయ్యిందని, ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 24 , 2026 | 01:09 AM