Share News

ఏపీ జెన్‌కో ఈఈగా బాలసుబ్రహ్మణ్యం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:28 PM

సీలేరు ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా యు.బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. స్థానిక ఈఈ శ్రీనివాసరెడ్డిని పదోన్నతిపై బదిలీ చేసిన నాటి నుంచి నేటి వరకు ఈఈని నియమించలేదు.

ఏపీ జెన్‌కో ఈఈగా బాలసుబ్రహ్మణ్యం
ఈఈ బాలసుబ్రహ్మణ్యంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న డీఈఈ, ఏఈఈలు

సీలేరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సీలేరు ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా యు.బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. స్థానిక ఈఈ శ్రీనివాసరెడ్డిని పదోన్నతిపై బదిలీ చేసిన నాటి నుంచి నేటి వరకు ఈఈని నియమించలేదు. తాజాగా విజయవాడ నార్ల తాతారావు ఽథర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యంకు ఈఈగా పదోన్నతి కల్పిస్తూ సీలేరు కాంప్లెక్స్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన విధుల్లో చేరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఈని డీఈఈలు అప్పలనాయుడు, భాస్కరావు, నాగార్జున, ఏఈఈలు సీహచ్‌ సురేశ్‌, అనుదీప్‌, శ్యాంసన్‌ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 11:28 PM