ప్రతి పౌరుడికి ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:01 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో ప్రతి పౌరునికి 12 అంకెలతో కూడిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తప్పనిసరి చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తినాయిక్ అన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తినాయిక్
పాడేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో ప్రతి పౌరునికి 12 అంకెలతో కూడిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తప్పనిసరి చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తినాయిక్ అన్నారు. అందుకు సంబంధించిన బ్యానర్, కరపత్రాలను శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుని ఆరోగ్య సమాచారం పక్కాగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పౌరులే తమ ఆధార్ కార్డును ఉపయోగించుకుని జ్ఛ్చిజ్టూజిజీఛీ.ుఽఛీజిఝ.జౌఠి.జీుఽ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అలాగే తమకు అందుబాటులో ఉన్న పారామెడికల్ సిబ్బంది వద్ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌ను పొందవచ్చునని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.