Share News

ఆయుర్వేద ఆస్పత్రి పునఃప్రారంభానికి సిద్ధం

ABN , Publish Date - May 20 , 2026 | 11:36 PM

అరకులోయ టీటీడీ కల్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి భవనం కొత్త రూపు సంతరించుకుని పునఃప్రారంభానికి సిద్ధమైంది.

ఆయుర్వేద ఆస్పత్రి పునఃప్రారంభానికి సిద్ధం
అరకులోయలో ఆధునిక హంగులతో ముస్తాబైన ఆయుర్వేద ఆస్పత్రి

రూ.30 లక్షలతో ఆధునికీకరణ

అరకులోయ, మే 20 (ఆంధ్రజ్యోతి): అరకులోయ టీటీడీ కల్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి భవనం కొత్త రూపు సంతరించుకుని పునఃప్రారంభానికి సిద్ధమైంది. నాలుగు నెలల కిత్రం ఈ ఆస్పత్రి భవనం మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఆయూష్‌ మిషన్‌ నుంచి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మెడికల్‌ సైన్సెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. భవనాన్ని సరికొత్తగా తయారు చేశారు. ఇది ఇప్పుడు పునఃప్రారంభానికి సిద్ధంగా ఉంది.

Updated Date - May 20 , 2026 | 11:36 PM