Share News

బొంతువలస ఘాట్‌లో ఆటో బోల్తా

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:21 AM

మండలంలోని బొంతువలస ఘాట్‌లో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గిరిజనులు గాయపడ్డారు.

బొంతువలస ఘాట్‌లో ఆటో బోల్తా
బొంతువలస ఘాట్‌లో బోల్తా పడిన ఆటో

ఆరుగురికి గాయాలు

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంతువలస ఘాట్‌లో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గిరిజనులు గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం గూడెంకొత్తవీధి లక్కవరపేట, జడుమురు గ్రామాలకు చెందిన గిరిజనులు కొయ్యూరులో జరిగే వివాహానికి ఆటోలో బయలుదేరారు. బొంతువలస ఘాట్‌లో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్కవరపుపేటకు చెందిన సిరిబాల నాగమణి, జడుమురు గ్రామానికి చెందిన గుజ్జు వేణుగోపాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురుకి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Apr 23 , 2026 | 12:21 AM