Share News

అర్జీదారుల సమస్యల పై అధికారులు నిర్లక్ష్యం వీడండి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:57 AM

అర్జీదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

అర్జీదారుల సమస్యల పై అధికారులు నిర్లక్ష్యం వీడండి
అర్జీదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)తోపాటు రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌కు 175, రెవెన్యూ క్లినిక్‌కు 256 అర్జీలు అందాయి. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించిన సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ మేరకు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీలు సుబ్బలక్ష్మి, మనోరమ, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ తుహిన్‌ సిన్హా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించిన ఆయన మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్‌లో అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది అర్జీలు అందజేశారు.

Updated Date - Feb 24 , 2026 | 12:57 AM