ఏయూ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:18 AM
ఏయూ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు
కొత్త తేదీలు ప్రకటన
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొత్త షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు బుధవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం బీఆర్క్, బీటెక్, బీటెక్ ప్లస్ ఎంటెక్, ఎంటెక్, ఎంప్లానింగ్, ఎమ్మెస్సీ, బి.ఫార్మసీ, ఎంఏ, ఎంసీఏ, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, బీఎడ్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే పరిపాలనా కారణాల రీత్యా వాయిదా వేసినట్టు ఆయన వెల్లడించారు. ఎమ్మెస్సీ (అన్ని కోర్సులు) పరీక్షలు జూన్ 30న, బీఎడ్ జూలై మూడో తేదీన, ఎంఏ, ఎంబీఏ, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంసీఏ పరీక్షలు జూలై 6న, బి.ఫార్మసీ జూలై 15న, బీఆర్క్, బీటెక్, బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సుల పరీక్షలు జూలై 22న, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు ఆగస్టు 5న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పరీక్ష తేదీ మాత్రమే మారిందని, సమయాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను గమనించి, కొత్త తేదీలకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.