నేడు ఏయూ స్నాతకోత్సవం
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:32 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం 91,92 స్నాతకోత్సవాలు సంయుక్తంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానున్నాయి. స్నాతకోత్సవ ఏర్పాట్లను మంగళవారం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ పి.కింగ్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్, డీన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ పలు సూచనలు చేశారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరరావు సగ్గుర్తి హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
హాజరుకానున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్
డాక్టర్ పూర్ణచంద్రరరావు సగ్గుర్తి
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం 91,92 స్నాతకోత్సవాలు సంయుక్తంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానున్నాయి. స్నాతకోత్సవ ఏర్పాట్లను మంగళవారం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ పి.కింగ్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్స్, డీన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ పలు సూచనలు చేశారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరరావు సగ్గుర్తి హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం
గోపాలపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నగరానికి బయలుదేరి వెళ్లారు.