Share News

ఏయూకు శతాబ్ది కళ

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:06 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ప్రతిరోజూ విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది.

ఏయూకు శతాబ్ది కళ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ప్రతిరోజూ విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 27న ఏయూ ఫౌండేషన్‌ వే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్సిటీని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు మద్దిలపాలెంలోని ఏయూ ఆర్చ్‌ నుంచి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వర్సిటీలోని వివిధ విభాగాలకు వెళ్లే మార్గాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు విభాగాల భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఏయూ ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటైన్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ విద్యుత్‌ దీపాలను అమర్చడంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రధాన గేటు పైభాగంలో కొత్తగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డులు ఏర్పాటు చేయడంతో ఏయూ నూతన కళను సంతరించుకుంది.

Updated Date - Apr 20 , 2026 | 01:06 AM