Share News

ప్రత్యేక అవసరాల విద్యార్థులపై శ్రద్ధ

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:43 PM

పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల శ్రద్ధ కనబరుస్తున్నామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

ప్రత్యేక అవసరాల విద్యార్థులపై శ్రద్ధ
ప్రత్యేక అవసరాల బాలలకు పరికరాలు అందిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, తదితరులు

జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

జిల్లాలో 185 మందికి కిట్లు పంపిణీ

పాడేరు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల శ్రద్ధ కనబరుస్తున్నామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక అవసరాల విద్యార్థుల కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో 185 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించామన్నారు. దీంతో వారికి అవసరమైన వీల్‌ చైర్లు, బ్రెయిలీ కిట్లు, వాకింగ్‌ స్టిక్స్‌, జనరల్‌ ఎడ్యుకేషన్‌ కిట్లు, తదితరాలు సమకూర్చామన్నారు. వాటిని పలువురు విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళ, ప్రత్యేక జిల్లా సహిత విద్యాధికారి కె.భాస్కరరావు, రీసోర్సు పర్సన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 10:43 PM