పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారుల హాజరు తప్పనిసరి
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:43 PM
జిల్లా కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 99 వినతులు స్వీకరణ
పాడేరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులంతా విధిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పాడేరులో నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులు గైర్హాజరు కావద్దన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయి అఽధికారులు మండలాల్లో పీజీఆర్‌ఎస్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఒక నియోజకవర్గంలో నెలకు నాలుగు రోజులు చొప్పున ఏదో మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలన్నారు. అలాగే స్వీకరించిన వినతులను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించిన ప్రజలు 1100 నంబర్ కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిషాంతి సూచించారు. శుక్రవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 99 వినతులను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ 54,, మిగిలిన 45 వినతులు విద్య, వైద్యం, తాగునీరు, ఇంజనీరింగ్ విభాగాలు, విద్యుత్, పౌరసరఫరాలకు సంబంధమైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, ఆర్‌డీవో భుజంగరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్ జి.దాసు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.