Share News

ప్రైవేటుకు దీటుగా...

ABN , Publish Date - May 10 , 2026 | 12:46 AM

ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎలమంచిలి బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఆడారి ప్రణతి 593 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంకా కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన తనకల ఉష 592, ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరుకు చెందిన కనిగిరి హరిణి, అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాథపురం స్కూల్‌ విద్యార్థి ప్రకృతి తారకేశ్‌ 591 మార్కులు సాధించారు.

ప్రైవేటుకు దీటుగా...
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల ఫొటోలు, వారు సాధించిన మార్కులతో ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

ఫొటోలు, మార్కుల వివరాలతో విద్యా శాఖ వినూత్న ప్రచారం

పలుచోట్ల ఫెక్లీలు ఏర్పాటు

ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు

ఎలమంచిలి, మే 9 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎలమంచిలి బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఆడారి ప్రణతి 593 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇంకా కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన తనకల ఉష 592, ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరుకు చెందిన కనిగిరి హరిణి, అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాథపురం స్కూల్‌ విద్యార్థి ప్రకృతి తారకేశ్‌ 591 మార్కులు సాధించారు. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో 247 మంది విద్యార్థులకు 570కిపైబడి మార్కులు వచ్చాయి. 2,962 మంది 500పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వం పాఠశాలల్లో చదివి, 588పైబడి మార్కులు సాధించిన 12 మంది విద్యార్థుల ఫొటోలతో ఫ్లెక్సీలను తయారు చేయించి, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయించారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా బాలికలు వుండడం విశేషం.

కాగా ఎలమంచిలిలోని బాలికల ఉన్నత పాఠశాలలో (హైస్కూల్‌ ప్లస్‌) ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన బాలికలందరూ ఉత్తీర్ణులయ్యారు. దీనికి సంబంధించి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల ఫొటోలతో ఫ్లెక్సీని మెయిన్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేశారు. వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - May 10 , 2026 | 12:46 AM