Share News

రక్షణ మంత్రి రాక

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:22 AM

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నగరానికి చేరుకున్నారు.

రక్షణ మంత్రి రాక

యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి’ని ప్రారంభించి, జాతికి అంకితం చేసేందుకు నగరారికి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విమానాశ్రయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

-గోపాలపట్నం/ఆంధ్రజ్యోతి


నగరానికి చేరుకున్న గవర్నర్‌

నేడు గురజాడ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరు

విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్‌ శనివారం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే గురజాడ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

Updated Date - Jul 11 , 2026 | 12:22 AM