ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు కొత్త బెల్లం రాక
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:45 AM
పండుగలు సమీపిస్తుండడంతో చెరకు రైతులు బెల్లం తయారీని మొదలుపెట్టారు.
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పండుగలు సమీపిస్తుండడంతో చెరకు రైతులు బెల్లం తయారీని మొదలుపెట్టారు. స్థానిక ఎన్టీఆర్ మార్కెట్‌యార్డుకు గురువారం మునగపాక మండలానికి చెందిన కొంతమంది రైతులు 212 కొత్త బెల్లం దిమ్మలు తీసుకొచ్చి విక్రయించారు. 2026-27 సీజన్‌లో ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు బెల్లం రావడం ఇదే ప్రథమం. బెల్లం రకాన్నిబట్టి వంద కిలోలు గరిష్ఠంగా రూ.4,805 అత్యల్పంగా రూ.4,295 ధరలు పలికినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.