Share News

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:53 PM

జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలి
చింతలవీధిలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. మండలంలో చింతలవీధి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చింతలవీధి పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌.రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 10:53 PM