Share News

పంచాయతీ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:44 PM

జిల్లాలో జరగనున్న తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లాపరిషత్‌ సీఈవో వాసుదేవరావు తెలిపారు.

పంచాయతీ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
చింతపల్లి పంచాయతీలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో వాసుదేవరావు

జడ్పీ సీఈవో వాసుదేవరావు

చింతపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరగనున్న తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లాపరిషత్‌ సీఈవో వాసుదేవరావు తెలిపారు. ఆదివారం చింతపల్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం జడ్పీ సీఈవో మాట్లాడుతూ తొలివిడతలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. మూడు మండలాల పరిధిలోనున్న 66 పంచాయతీలు 686 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. 26న పంచాయతీ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహణకు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈకార్యక్రమంలో డీడీవో జయప్రకాశ్‌, చింతపల్లి ఎంపీడీవో లాలం సీతయ్య, తహశీల్దార్‌ హనుమంతు త్రివేణి పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:44 PM