Share News

అరకులోయలో ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:04 PM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అరకులోయలో ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు
పలు శాఖలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్న దృశ్యం

నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహణ

అరకులోయ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివారమే అయినప్పటికీ జిల్లా యంత్రాంగం సోమవారం ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు వేల మంది పాల్గొనేలా గ్యాలరీ, ప్రధాన వేదిక, పలు శాఖలకు చెందిన 14 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఆదివారం రాత్రి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరుకానున్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Aug 09 , 2026 | 11:06 PM