టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:45 PM
ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్.కె.రామకృష్ణారావు తెలిపారు.
హాజరు కానున్న 11,988 విద్యార్థులు
అల్లూరి జిల్లాలో 44,
పోలవరం జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు
8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల గుర్తింపు
జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్.కె.రామకృష్ణారావు
పాడేరురూరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్.కె.రామకృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అల్లూరి జిల్లాలో 44, పోలవరం జిల్లాలో 28 మొత్తం 72 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 264 పాఠశాలలకు చెందిన 11,988 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు 653 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది డిపార్టుమెంట్ అధికారులు, 72 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 8 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పోలీస్ భద్రత, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు జరిగే పదో తరగతి సార్వత్రిక పరీక్షలకు అల్లూరి జిల్లాలో 10, పోలవరం జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 14,187 మంది పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు.