Share News

పల్స్‌ పోలియోకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:37 AM

జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌ తెలిపారు. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 86 వేల 125 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశామన్నారు.

పల్స్‌ పోలియోకు ఏర్పాట్లు పూర్తి
డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌

- నేడు 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహణ

- జిల్లా వ్యాప్తంగా 800 బూత్‌లు

- 86,125 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యం

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌

పాడేరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌ తెలిపారు. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 86 వేల 125 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 800 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. 35 ట్రాన్సిట్‌ పాయింట్లు, 35 మొబైల్‌ బృందాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 74 గిరిశిఖర ప్రాంతాలను గుర్తించి, అక్కడ చేపట్టాల్సిన చర్యలపైనా ప్రణాళికాబద్ధంగా వ్యహరిస్తామన్నారు. 0 నుంచి ఐదేళ్ల వయసున్న మొత్తం 86 వేల 125 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు లక్షా 8 వేల డోస్‌లు సిద్ధం చేశామన్నారు. తొలి ఆదివారం అనివార్య కారణాలతో చుక్కల మందు వేసుకోని చిన్నారుల కోసం 29, 30న వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Updated Date - Jun 28 , 2026 | 12:38 AM