Share News

శాంతియుత ఎన్నికలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:07 AM

గ్రామ సంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు. జిల్లాలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, ఆయాచోట్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నిఘా పెట్టాలని ఆదేశించారు.

శాంతియుత ఎన్నికలకు ఏర్పాట్లు
జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశం

అనకాపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ సంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల ముందస్తు భద్రతా చర్యలపై చర్చించి, పలు సూచనలు చేశారు. జిల్లాలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, ఆయాచోట్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు నిఘా పెట్టాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను, స్థానికంగా అలజడులు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి తక్షణమే పోలీసు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, బైండోవర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా మద్యం అక్రమ రవాణా, బెల్ట్‌ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, లోపాలుంటే సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులతో మాట్లాడి సరిచేయించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పట్టే వారిపై సాంకేతిక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Nov 18 , 2026 | 01:07 AM