ఘనంగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:38 PM
జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు వేదిక, ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాల ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
పాడేరులోని తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహణ
పాడేరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు వేదిక, ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాల ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం, స్టాళ్లు, శకటాల ప్రదర్శన, విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీతో కార్యక్రమం ముగుస్తుంది. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖాధికారులు, తలారిసింగి ఆశ్రమ పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నారు.