Share News

గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:37 AM

సింహగిరి ప్రదక్షిణకు దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కొండ దిగువన తొలిపావంచా వద్ద సుమారు రూ.కోటి వ్యయంతో పక్కా షెడ్డు నిర్మాణం చేపట్టారు.

గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు
తొలిపావంచా వద్ద నూతన షెడ్‌

తొలి పావంచా వద్ద రూ.కోటితో షెడ్డు

సింహాచలం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):

సింహగిరి ప్రదక్షిణకు దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కొండ దిగువన తొలిపావంచా వద్ద సుమారు రూ.కోటి వ్యయంతో పక్కా షెడ్డు నిర్మాణం చేపట్టారు. భక్తులు తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందుకు అనుగుణంగా అధిక సంఖ్యలో గెడ్డర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా పాతగోశాల కూడలి నుంచి పాత అడివివరం కూడలి వరకు ప్రయాణికులకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్‌ కమిషనర్‌ సూచనల మేరకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేశారు. పాత అడివివరం కూడలి నుంచి వరాహ పుష్కరిణి, గాంధీనగర్‌, రాజవీధి వరకు మెటల్‌ రోడ్డు నిర్మించారు. ఈ నెల 28వ తేదీన జరగనున్న గిరి ప్రదక్షిణలో సుమారు 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 01:37 AM