అరకు జడ్పీటీసీకి తీవ్ర పోటీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:20 PM
మండల జడ్పీటీసీ స్థానానికి టికెట్కు అన్ని పార్టీల్లో పోటీ నెలకొంది. జడ్పీటీసీ టికెట్ కోసం టీడీపీలో నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. వైసీపీలో ఎమ్మెల్యే తనయుడి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి
పెరుగుతున్న ఆశావహుల జాబితా
వైసీపీలో ఎమ్మెల్యే కుమారుడి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత
అరకులోయ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):
అరకులోయ జడ్పీటీసీ టికెట్ కోసం టీడీపీలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శెట్టి బాబూరావు, పెదలబుడు మాజీసర్పంచ్ పెట్టెలి దాసుబాబు, టీడీపీ నాయకులు శ్యామ్, వంతల పూర్ణ పోటీ పడుతున్నారు. ఎంపీపీ పదవి కోసం టీడీపీ మండల అధ్యక్షుడు, పద్మాపురం సర్పంచ్ లకోయ్ మహాదేవ్, తదితరులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా వైసీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే రేగం మత్సలింగం తన కుమారుడు చాణక్యను జడ్పీటీసీ అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీలో నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు చాణుక్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం అరకులోయలో వైసీపీ నేతలతో ఎమ్మెల్యే జరిపిన సమావేశంలో జడ్పీటీసీ టికెట్పై పార్టీ నేతల వైఖరి వెల్లడి కావడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి సంకేతాలు వస్తాయో వేచిచూడాలి. కాగా అరకులోయ జడ్పీటీసీ స్థానానికి సీపీఎం నుంచి సుంకరమెట్ట మాజీ సర్పంచ్ గెమ్మెలి చినబాబు పోటీ చేయనున్నారు.