Share News

అరకులోయ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:11 PM

అరకులోయ పోలీస్‌ స్టేషన్‌ను పాడేరు డీఎస్పీ అభిషేక్‌ ఆదివారం తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించారు.

అరకులోయ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ
అరకులోయ పోలీస్‌ స్టేషన్‌లో ల్యాప్‌టాప్‌లో రికార్డులు పరిశీలిస్తున్న పాడేరు డీఎస్పీ అభిషేక్‌

రికార్డులు పరిశీలించిన పాడేరు డీఎస్పీ అభిషేక్‌

పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఐకి ఆదేశం

అరకులోయ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అరకులోయ పోలీస్‌ స్టేషన్‌ను పాడేరు డీఎస్పీ అభిషేక్‌ ఆదివారం తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి పరిష్కరించాలని అరకు సీఐ హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అతివేగంగా నడిపే వారిపై, లైసెన్సు, రికార్డులు లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే పర్యాటకులు, ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేసేవారిపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి సాగును శాశ్వతంగా నివారించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 11:11 PM