Share News

అరకు క్రీడా పాఠశాల విద్యార్థి సత్తా

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:41 AM

అరకులోయ గురుకుల క్రీడా పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.లలిత్‌సాయితేజ్‌ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.ఎస్‌.ఎన్‌.మూర్తి తెలిపారు.

అరకు క్రీడా పాఠశాల విద్యార్థి సత్తా
లలిత్‌సాయితేజ్‌తో ప్రిన్సిపాల్‌ మూర్తి, కోచ్‌ సూరిబాబు

- జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక

అరకులోయ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అరకులోయ గురుకుల క్రీడా పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.లలిత్‌సాయితేజ్‌ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.ఎస్‌.ఎన్‌.మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న విశాఖపట్నంలోని సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన మనోహర్‌ జోసెఫ్‌, లలిత్‌సాయితేజ్‌ పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరంలో జరిగి రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సత్తా చాటి లలిత్‌సాయితేజ్‌ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా కోచ్‌ సూరిబాబును ఆయన అభినందించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఐదుగురి ఎంపిక

కర్నూల్‌ జిల్లా ఆధోనిలో వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ మూర్తి తెలిపారు. డి.అశోక్‌, కె.చంద్రకాంత్‌, సురేశ్‌, జి.కార్తీక్‌, ఎం.ఆదిత్య ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

Updated Date - Sep 30 , 2026 | 12:41 AM