Share News

శరవేగంగా అరకు రైల్వే స్టేషన్‌ పనులు

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:13 PM

అరకులోయ నూతన రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. సీలింగ్‌, ఫ్లోరింగ్‌ పనులు జోరుగా సాగుతున్నాయి.

శరవేగంగా అరకు రైల్వే స్టేషన్‌ పనులు
నిర్మాణంలో ఉన్న అరకులోయ నూతన రైల్వే స్టేషన్‌ భవనం

అరకులోయ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): అరకులోయ నూతన రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. సీలింగ్‌, ఫ్లోరింగ్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అరకులోయ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి గత ఏడాది రూ.14 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పనులను వేగవంతం చేశారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జోరుగా సాగుతున్నాయి.

Updated Date - Jun 09 , 2026 | 11:13 PM