Share News

200 ఎకరాల్లో అరకు ఆర్ట్‌ విలేజ్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:38 PM

అరకులోయలో 200 ఎకరాల్లో అరకు ఆర్ట్‌ విలేజ్‌ అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు.

200 ఎకరాల్లో అరకు ఆర్ట్‌ విలేజ్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అరకులోయ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో 200 ఎకరాల్లో అరకు ఆర్ట్‌ విలేజ్‌ అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. అరకు ఫైనరీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. చొంపి ప్రాంతంలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో దేశ, విదేశాల నుంచి క్రియేటర్స్‌ను తీసుకువచ్చి అరకు ఆర్ట్‌ విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఆర్ట్‌ విలేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటువంటి ఆర్ట్‌ విలేజ్‌ వల్ల పర్యాటకుల సందర్శన పెరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కలిసి సంయుక్తంగా చేపడతాయన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు దృష్టిలో పెట్టి తర్వాత కార్యచరణను ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా అరకు అందాలకు ప్రత్యేక గుర్తింపు విధంగా ఆర్ట్‌ ఫాంను ఉండేలా రీసెర్చి వర్కింగ్‌ గ్రూపుతో పరిశోధన చేయిస్తున్నట్టు చెప్పారు. ఆదివాసీ గిరిజనోత్సవం నాటికి మంత్రి ఆధ్వర్యంలో ఆర్‌ఫాం ఏర్పాటుపై ప్రకటించే అవకాశం ఉందన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:38 PM