ఉపాధికి యాప్‌సోపాలు
ABN , Publish Date - May 27 , 2026 | 11:55 PM
ఉపాధి హామీ పథకంలో నేషనల్ మొబైల్ మానెటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్)ను తీసుకురావడంతో ఉపాధి శ్రామికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సాంకేతిక సమస్య వలన నమోదుకాని ముఖ హాజరు
నిరాశతో వెనుదిరిగిన శ్రామికులు
డుంబ్రిగుడ, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో నేషనల్ మొబైల్ మానెటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్)ను తీసుకురావడంతో ఉపాధి శ్రామికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ హాజరు నమోదు కాకపోవడంతో పని దొరక్క వెనుదిరగాల్సి వస్తోంది. బుధవారం డుంబ్రిగుడ మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్య వలన ఎన్‌ఎంఎంఎస్ యాప్ పని చేయకపోవడంతో ఉపాధి పని కోసం వచ్చిన శ్రామికులు గంటల తరబడి వేచి ఉన్నారు. అయినా ముఖ హాజరు నమోదు కాకపోవడంతో నిరాశతో ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ముఖ హాజరు పద్ధతిని తొలగించి పాత పద్ధతిలోనే ఉపాధి పనులు కొనసాగించాలని గిరిజనులు కోరుతున్నారు.