Share News

స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి పాలకమండలి నియామకం

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:18 AM

స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి 12 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి  పాలకమండలి నియామకం

12 మంది పేర్లతో జాబితాను విడుదల చేసిన దేవదాయ శాఖ

చోడవరం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి 12 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా మంగా శ్రీనివాసరావు, డి.లక్ష్మీ నరసింహారావు, యు.శ్రీనివాసరావు, డి.మోహన వెంకట జయసింహా, బి.వి.ఎస్‌. సంతోషికుమారి, ఎస్‌.లక్ష్మి, జె.మురళి, వై.వరలక్ష్మి, వెంకటలక్ష్మి, కె.ఈశ్వరరావు, ఎం.ఈశ్వరమ్మ, అర్చకుడు కె.వెంకటరావు (ఎక్స్‌ అఫిషియో) నియమితులయ్యారు. వీరిలో గౌరీపట్నం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మంగా శ్రీనివాసరావు చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారానికి ముందు చైర్మన్‌ను లాంఛనప్రాయంగా ఎన్నుకుంటారు. కాగా పాలకమండలి సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, జనసేన ఇంచార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, బీజేపీ నాయకుడు ఈర్లె శ్రీరామమూర్తిలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 22 , 2026 | 01:18 AM