Share News

ఒకటో తరగతి ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:00 PM

ద్యాహక్కు చట్టంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఉచిత సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకటో తరగతి ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు

సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు

పాడేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఉచిత సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా అర్హులైన పేదలకు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను కల్పిస్తారని, అందుకు ఈనెల 20 నుంచి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ జ్ట్టిఞ://ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ , గ్రామ సచివాలయం మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, సంబంధిత పాఠశాలలోనూ మార్చి 10 తేదీలోగా దరఖాస్తు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థి 2020 జూన్‌ 2 నుంచి 2021 మే 31 మధ్యలో జన్మించి ఉండాలనే నిబంధన ఉందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, ఈనెల 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థుల ఆన్‌లైన్‌ నమోదు చేయాలని, మార్చి 17న గ్రామ సచివాలయల వారీగా దరఖాస్తుల వివరాలు, అర్హులైన విద్యార్థుల జాబితా రూపకల్పన, మార్చి 25న తొలి విడత అర్హులకు సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. అలాగే ఏప్రిల్‌ 7 లోపు ప్రవేశాల ధ్రువీకరణ, ఏప్రిల్‌ 12న రెండో విడత సీట్ల కేటాయింపు, ఏప్రిల్‌ 13న నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలున్నా టోల్‌ ఫ్రీ నంబర్‌: 18004258599కు సంప్రదించవచ్చునని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు సూచించారు.

Updated Date - Feb 06 , 2026 | 11:00 PM