అర్జీదారుల సంతృప్తే ముఖ్యం
ABN , Publish Date - May 29 , 2026 | 10:46 PM
పీజీఆర్‌ఎస్ అర్జీదారుల సంతృప్తి చెందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 96 వినతులు స్వీకరణ
పాడేరు, మే 29 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ అర్జీదారుల సంతృప్తి చెందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమంలో ఆమెఅధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు సమర్పించిన వినతులను పక్కాగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలాగే మండల స్థాయి పీజీఆర్‌ఎస్ విధిగా నిర్వహించాలన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్జీలపై తాజా స్థితిగతులను తెలుసుకునే ందుకు 1100 నంబర్ కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సూచించారు. కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 96 వినతులను స్వీకరించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, హౌసింగ్ పీడీ బి.బాబు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్ , ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, జిల్లా టూరిజం ఆఫీసర్ జి.దాసు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.