సముద్రంలో నాచు వల్లే చేపలు చనిపోయాయట!
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:58 AM
మండలంలోని బోయపాడు తీరంలో చేపలు మృత్యువాత పడడానికి సముద్రంలో నాచుతోపాటు, సరిపడ ఆక్సిజన్ అందకపోవమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలుష్యం వల్ల చేపలు మృతిచెందినట్టు ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఆక్సిజన్ సరిపడ లేకపోవడం కూడా కారణమట...
బోయపాడు తీరంలో చేపల మృతిపై ప్రాథమిక నివేదిక
విశాఖపట్నం జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోయపాడు తీరంలో చేపలు మృత్యువాత పడడానికి సముద్రంలో నాచుతోపాటు, సరిపడ ఆక్సిజన్ అందకపోవమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలుష్యం వల్ల చేపలు మృతిచెందినట్టు ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
వేలాదిగా మృతిచెందిన చేపలు ఈ నెల 20వ తేదీన నక్కపల్లి మండలం బోయపాడు సముద్ర తీరానికి చేరాయి. దీనిపై మీడియాలో వార్తలు రావడంతోపాటు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. చేపలు మృత్యువాత పడిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత ఆదేశించారు. దీంతో మెరైన్ నిపుణులు, మత్స్య శాఖాధికారులు, సెంట్రల్ మెరైన్ సాంకేతిక సిబ్బంది ఇక్కడకు వచ్చి చనిపోయిన చేపలను పరిశీలించారు. బోయపాడు తీరంలో 1,500 మీటర్ల పొడవున, ఐదు మీటర్ల వెడల్పున ఒకే రకమైన చేపలు చనిపోయినట్టు బృందం నిర్ధారించింది. అనంతరం కొన్ని నమూనాలను సేకరించి వెంట తీసుకెళ్లారు. విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్షించారు. ప్రాథమిక నివేదికను శుక్రవారం రాత్రి సిద్ధం చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌కు, ఇతర ఉన్నతాధికారులకు పంపించారు. సముద్రపు నాచు వల్ల, ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడినట్టు ప్రాఽథమికంగా నిర్ధారించారు. కాలుష్యం వల్ల మృతి చెందినట్టు ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరుగుతున్నదని నివేదికలో పేర్కొన్నారు.