Share News

నేటి నుంచి అప్పన్న అంతరాలయ దర్శనాలు రద్దు

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:40 AM

వైశాఖమాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు మే ఒకటో తేదీన సింహాచలం దేవస్థానంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో వెంకటరావు ప్రకటించారు. అలాగే గురువారం నుంచి మే మూడో తేదీ వరకు అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామన్నారు.

నేటి నుంచి అప్పన్న అంతరాలయ దర్శనాలు రద్దు

మే 1న ఆర్జిత సేవలూ నిలుపుదల

సింహాచలం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

వైశాఖమాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు మే ఒకటో తేదీన సింహాచలం దేవస్థానంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఈవో వెంకటరావు ప్రకటించారు. అలాగే గురువారం నుంచి మే మూడో తేదీ వరకు అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామన్నారు. మే ఒకటో తేదీ శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రెండో విడత చందన సమర్పణ, ప్రభాత ఆరాధన, బాలభోగ నివేదన, విశేష సేవలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 6.30 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు పవళింపు సేవ, రాత్రి 7 గంటల నుంచి 8.30 వరకు రాత్రి ఆరాధనలు జరుగుతాయని, ఆ సమయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తారన్నారు. రాత్రి 9 గంటలకు ఆలయ కవాట బంధనం చేస్తామన్నారు.

చందనం విక్రయాలకు విరామం

రెండో విడత చందన సమర్పణ కార్యక్రమం సందర్భంగా మే ఒకటో తేదీ నుంచి మూడురోజులు నిర్మాల్య చందనం విక్రయాలను నిలిపివేస్తున్నామని ఈవో తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 01:40 AM