Share News

వచ్చే నెల నుంచి ఏఐ వర్సిటీ కార్యకలాపాలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:37 AM

దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు.

వచ్చే నెల నుంచి ఏఐ వర్సిటీ కార్యకలాపాలు

  • ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌

  • దేశంలో ఇదే తొలిసారి అని వెల్లడి

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), జనవరి 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు. ఎన్‌విడియా భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. భారత్‌-ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026కు ప్రీ సమ్మిట్‌ కార్యక్రమంగా ఏఐ ఫర్‌ పబ్లిక్‌ గుడ్‌ డెమో డే కార్యక్రమాన్ని బుధవారం గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ ఒక ఏఐ ఏజెంట్‌(టూల్‌)ను అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ ద్వారా ఏజెంట్‌ స్పేస్‌ పేరుతో రూపొందించిన ఈ ఏఐ ఆధారిత వర్క్‌ స్పేస్‌.. పాలనా ఉత్పాదకత సేవలను మరింత మెరుగు పరుస్తుందన్నారు. రానున్న కాలంలో పాలనతో పాటు వృత్తి రంగాల్లో ఏఐ ప్రభావం మరింత విస్తృతంగా ఉండనుందని పేర్కొన్నారు. యువ త ఏఐ సంబంధిత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభు త్వ పాలన, పౌర సేవల కోసం ఇప్పటికే అభివృద్ధి చేయబడి, పరీక్షించబడి అమలుకు సిద్ధంగా ఉన్న 10 ఏఐ వ్యవస్థలను ఈ డెమో డే కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించారు. ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశాలకు ఎలాంటి పరిష్కారాలను చూపుతాయో వివరించారు. కార్యక్రమంలో గీతం ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, జీఎ్‌సఐబీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజాఫణి పప్పు, వివిధ విభాగాల డీన్‌లు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 04:37 AM