Share News

జిల్లాకు మరో మెగా ప్రాజెక్టు

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:36 AM

జిల్లాకు మరో మెగా ప్రాజెక్టు

జిల్లాకు మరో మెగా ప్రాజెక్టు

గ్రీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

‘మాకవరపాలెం’లో రూ.85 వేల కోట్లతో ఏర్పాటు

1,000 మెగావాట్ల సామర్థ్యం, 1,880 మందికి ఉద్యోగాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పరిశ్రమల ఏర్పాటు విషయంలో అనకాపల్లి జిల్లా దూసుకుపోతున్నది. ఇప్పటికే భారీ ఉక్కు, పునరుత్పాదక ఇంధన తయారీ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తగా.. తాజాగా మరో గ్రీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌ను ప్రభుత్వ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూ గ్రీన్‌ ఏపీ గ్రీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిసింది. రూ.85,000 కోట్లతో స్థాపించే ఈ ప్రాజెక్టులో 1,880 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు బుధవారం సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోద ముద్ర వేసింది. మాకవరపాలెం మండలంలో ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో సుమారు 300 ఎకరాలను కేటాయించనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా నిర్మించనున్న ఈ డేటా సెంటర్‌ దేశంలో అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది.

Updated Date - Jul 31 , 2026 | 12:36 AM